కుటుంబంతో సరదాగా హోటల్‌కు వెళ్లి భోజనం చేసిన వారు అస్వస్థతకు గురైన ఘటన... ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హోటల్ బార్కాస్‌లో ఆదివారం రాత్రి మండీ బిరియాని, చికెన్, చేపలు తిన్న వారు... జ్వరం, వాంతులు, తలనొప్పి లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అదే హోటల్‌లో భోంచేసిన సుమారు 20 మంది వరకూ ఈ విధంగా అనారోగ్యం బారిన పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు ఆహారం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. కల్తీ లక్షణాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి