నెల్లూరులో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలపై వైకాపా నాయకులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ ఘటనలో కోటంరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి వైకాపా నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని తిరుమల ఆరోపిస్తున్నారు. ఈరోజు రామ్మూర్తి నగర్ వద్ద తిరుమలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తిరుమల తలకు తీవ్ర గాయాలయ్యాయి. సింహపురి ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మేయర్ అజీజ్‌లు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. దాడికి నిరసనగా తెదేపా కార్యకర్తలు నెల్లూరులో ధర్నా చేశారు. నిందితులను వెంటనే గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిపై దాడి - dhadi
నెల్లూరు టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలపై వైకాపా నాయకులు దాడి చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని... గత కొన్ని రోజులుగా వైకాపా నేతలు బెదిరిస్తున్నారని తిరుమల ఆరోపించారు.
నెల్లూరులో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలపై వైకాపా నాయకులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ ఘటనలో కోటంరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి వైకాపా నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని తిరుమల ఆరోపిస్తున్నారు. ఈరోజు రామ్మూర్తి నగర్ వద్ద తిరుమలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తిరుమల తలకు తీవ్ర గాయాలయ్యాయి. సింహపురి ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మేయర్ అజీజ్‌లు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. దాడికి నిరసనగా తెదేపా కార్యకర్తలు నెల్లూరులో ధర్నా చేశారు. నిందితులను వెంటనే గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇటీవల వైకాపా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యం చేయడంతో ఆయన్ని అరెస్టు చేశారు. దీనిపై కోటం రెడ్డికి వ్యతిరేకంగా తిరుమల కార్యక్రమం నిర్వహించారు. అప్పట్నుంచి వైకాపా నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని తిరుమల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తి నగర్ దగ్గర ఉన్న తిరుమలపై కొందరు వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తిరుమలకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని సింహపురి ఆస్పత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మేయర్ అజీజ్ లు తిరుమలను పరామర్శించారు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291