నెల్లూరు జిల్లా ఏఎస్ పేటకు చెందిన షరీఫ్ హైదరాబాద్‌లో అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌లో వారంరోజులుగా కనిపించడం లేదు. రెండు నెలల క్రితం.. ఏఎస్ పేటకు చెందిన అన్నదమ్ములు.. హైదరాబాద్ అంజన హోమ్ కేర్ సర్వీసెస్ టేక్ కేర్ కంపెనీలో.. రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరారు. జీతం ఇవ్వకపోవడంతో కంపెనీ నిర్వాహకులతో అన్నదమ్ముల గొడవ పడ్డారు. సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. సంస్థ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి.. ఈ నెల 10వ తేదీన జీతం ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. కంపెనీతో గొడవ జరిగిన నాటి నుంచి షరీఫ్ కనిపించడం లేదు. తమ్ముడు కనిపించడం లేదని జగద్గిరిగుట్ట పీఎఎస్‌లో అన్న కలాం ఫిర్యాదు చేశారు.
కుమారుడు కనిపించడం లేదని షరీఫ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. జీతం డబ్బులు అవసరం లేదని.. తమ బిడ్డ ఇంటికి క్షేమంగా చేరితే చాలని విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: Gudiwada land issue: ఇనాం భూములు వారసులవే అంటూ నివేదిక?