నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తెదేపా ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్యే సంజీవయ్య రాజీనామా గురించి సవాల్ విసరడాన్ని స్థానిక వైకాపా నేతలు తప్పుపట్టారు. నాయుడుపేటలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తమకు ఆధిక్యం వస్తుందని సంజీవయ్య చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. నిజాయితీగా పనిచేస్తున్న ఎమ్మెల్యేను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ సరఫరా పెంపునకు మోదీ కీలక నిర్ణయం
స్వగ్రామం భీమవరంలో తన భార్యను సర్పంచిగా గెలిపించుకునేందుకు.. నెలవల సుబ్రహ్మణ్యం ఏడ్చి గందరగోళం చేశారని అధికారపార్టీ నేతలు ఆరోపించారు. "తిరుపతి ఎన్నికల్లో మా పార్టీ గెలవకపోతే పదవికి రాజీనామా చేస్తా" అని వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి సవాల్ చేశారు. తెదేపా ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా... అంటూ ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
సర్వేపల్లి కాలువ పనులు 5 నెలల్లో పూర్తి చేస్తాం: మంత్రి అనిల్