నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారంటూ..వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్దకు తరలివచ్చారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వైఖరిని నిలదీశారు. ఈ క్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి