Fire accident in nellore: నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట గ్రామంలో షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగటంతో.. బావి వద్దనున్న పూరి గుడిసె దగ్దమైంది. గుడిసెలో నివసిస్తున్న హైదరాబాద్కు చెందిన ఇద్దరు మహిళల్లో.. ఓ మహిళ సజీవ దహనం కాగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
మతిస్దిమితం లేని వారిని జిల్లాలోని శ్రీ ఖాజా నాయబ్ రసూల్ దర్గా వద్ద.. కొంత మంది పర్యవేక్షణలో వీరిని వదిలి వెళ్తారు. ఆ కోవకు చెందిన వారే ఈ ఇద్దరు మహిళలు కూడా. అయితే.. అలా వదిలి వెళ్లిన వారి పర్యవేక్షణను పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పలు రాష్ట్రలకు చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: మారణాయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోల్ పోసి..