ETV Bharat / state

'నాలుగేళ్లలో 4 ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తాం' - Fishing Harbours Latest News

మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సైతం విడుదల చేశాయి. అధికారులు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

'నాలుగేళ్లలో 4 ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తాం'

author img

By

Published : Apr 9, 2021, 5:22 PM IST

'నాలుగేళ్లలో 4 ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తాం'

రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్​లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకు రూ.1,088 కోట్ల నిధులను సైతం మంజూరు చేశాయి. త్వరలోనే పనులు కూడా చేపడతామని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు వెల్లడించారు.

గంగపుత్రుల ఇబ్బందులు తీర్చేందుకు..

నెల్లూరు జిల్లాలో గంగపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తోందని మత్స్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని బోగోలు మండలం జువ్వల దిన్నె గ్రామంలోని ఈ ఫిషింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నెలో ఏర్పాటు చేసే ఫిషింగ్ హార్బర్ కోసం ప్రభుత్వం రూ.288 కోట్ల నిధులు కేటాయించగా.. రూ.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. త్వరలోనే ఆయా పనులు ప్రారంభించనున్నట్లు మత్స్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఒకేసారి 1,250 బోట్లు పార్కింగ్..

ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయటం వల్ల జిల్లాలోని ఆరువేల మంది గంగపుత్రులు అభివృద్ధి చెందుతారని మత్స్యశాఖ అధికారులు వివరించారు. హార్బర్​లో సుమారు 1,250 బోట్లను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. హార్బర్​ను నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే సీఎం జగన్‌ ఆలోచన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.