ETV Bharat / state

మహిళా ఎస్సైతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన​

మద్యం మత్తులో వార్డ్​ వాలంటీర్​ రెచ్చిపోయాడు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు చేస్తున్న మహిళా ఎస్సైపై అసభ్య పదజాలంతో దూషించాడు. వాలంటీర్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే మంగళవారం రాత్రే సీఐ గుంటూరు రేంజికి బదిలీ కావడం చర్చనీయాంశమైంది

మద్యం మత్తులో వాలంటీర్​ వీరంగం
మద్యం మత్తులో వాలంటీర్​ వీరంగం
author img

By

Published : Jul 8, 2020, 6:41 AM IST

Updated : Jul 8, 2020, 9:49 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహిళా ఎస్సై పట్ల స్థానిక 21వ వార్డు వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. సోమవారం అర్ధరాత్రి ఎస్సై రోజాలత పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా...మద్యం సేవించి అటుగా వచ్చిన వాలంటీర్‌ను పోలీసు సిబ్బంది ఆపారు. దీంతో రెచ్చిపోయిన వాలంటీర్‌ ఎస్సైని దుర్భాషలాడాడు. మహిళా ఎస్సై అని కూడా చూడకుండా మీద మీదకు వస్తూ తిట్ల పురాణం అందుకున్నాడు. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు.

మహిళా ఎస్సైతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన​

మహిళా ఎస్సైను దూషించిన వాలంటీర్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ పాపారావు తెలిపారు. వాలంటీర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అయితే మంగళవారం రాత్రే ఆ సీఐ బదిలీ కావడం చర్చనీయాంశమైంది. ఆయనను గుంటూరు రేంజి కార్యాలయానికి ఎటాచ్ చేశారు.

ఇదీ చదవండి : తల్లితోనే కాదు.. తాను గుళికలు తాగిన కుమారుడు.. ఇద్దరూ మృతి

Last Updated : Jul 8, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.