ETV Bharat / state

నెల్లూరు జీజీహెచ్‌ కార్మికుల వేతన కష్టాలు.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : Mar 2, 2023, 9:15 PM IST

Not Paying Salaries To Workers : ఒక నెల వేతనం ఆలస్యమైతేనే ప్రభుత్వ ఉద్యోగులైైనా.. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులైనా ఇబ్బంది పడతారు. వారికి ఉన్న చెల్లింపులు గురించి టెన్షన్ పడతారు. వేల రూపాయలు వచ్చే వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక నెల వేతనం ఆలస్యమైతేనే ఇంత అవస్థలు పడితే.. ఐదు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరులోని జీజీహెచ్ కార్మికులకు కాంట్రాక్ట్​ సంస్థ జీతాలు ఇవ్వడం లేదు.. అధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడే లేదు. దీంతో కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెల్లూరు
GGH

Not Paying Salaries To Workers : ఒక నెల వేతనం ఆలస్యమైతేనే ఎంతో అవస్థ పడతాం. అదే ఐదు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరులోని జీజీహెచ్ కార్మికులకు కాంట్రాక్ట్​ సంస్థ నెల జీతాలు ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెల జీతం రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులు విలవిల్లాడుతారు. వేలాది రూపాయలు జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా రోడ్డెక్కి పోరాటం చేస్తారు. పారిశుద్ద్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు రాకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. వీరు రోడ్డెక్కి పోరాటం చేస్తే.. వారి ఉద్యోగాలు మరుసటి రోజు ఉండవు. నెల్లూరు జీజీహెచ్​లో కార్మికుల కష్టాలు ఇవి. కాంట్రాక్ట్ పనులు చేయించే ఓ సంస్థ కనీసం మానవత్వం లేకుండా పని చేయించుకుంటుంది. నెల జీతాలు ఇవ్వకుండా వేదనకు గురి చేస్తున్నారు.

నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ద్య విభాగంలో పనిచేసే కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉంటాయి. రోజుకు 8 గంటలకుపైగా పని చేయించుకుంటారు. ప్రతి నెల జీతాలు ఇవ్వరు. కొందరికి ఐదు నెలలు, మరికొందరికి మూడు నెలలకు జీతాలు ఇస్తున్నారు. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోరు. మానవత్వంతో ఆలోచించరు.

పనులను ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. ఆ సంస్ధ వేతనాలు ఇస్తుందా, ఎంత ఇస్తుంది అనే విషయాలను అసలు పట్టించుకోరు. దీంతో కార్మికులు అర్థాకలితో జీవితాలను వెళ్లదీస్తున్నారు. జీజీహెచ్​లోని ఆసుపత్రి నిర్వహణ, మెడికల్ కళాశాలలో సుమారు 200మంది కార్మికులు ఈ విధంగా పని చేస్తున్నారు. పది నిమిషాలు ఆలస్యం అయినా గైర్హాజరైనట్లు నమోదు చేస్తారు. ఇంత ఖచ్చితంగా సమయం చూసే అధికారులు.. జీతాలు ఇప్పించడంలో శ్రద్ధ చూపించడం లేదని కార్మికులు వాపోతున్నారు.

సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో బయట రోడ్డు నుంచి ఆసుపత్రి మొత్తం శుభ్రం చేయడం, వాష్ రూములు శుభ్రం చేయడం.. రోగులు ఉండే గదులు శుభ్రం చేస్తారు. సెక్యూరిటీగా పని చేస్తారు. పనులు చేయించుకుంటున్నారు. నెలకు జీతాలు అందక.. చార్జీలకు డబ్బులు లేక కిలోమీటర్లు నడిచి ఉద్యోగానికి వస్తున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు 16వేల రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉంటే వారి చేతికి రూ.9వేలు ఇస్తున్నారు. కొందరికి 7వేల రూపాయలే ఇస్తున్నారు. ఒక్కరోజు సెలవు తీసుకున్నా జీతంలో కోతలు విధిస్తున్నారు.

జీతాలు సరిగా రాకపోవడంతో బయట అప్పులు కూడా దొరకడం లేదని కార్మికులు కన్నీరు పెడుతున్నారు. కుటుంబాలు జరగడం కష్టంగా ఉందని, ఒప్పందం మేరకు పూర్తి జీతం ఇవ్వాలని, ప్రతి నెలకు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.