నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఎంపీ విజయసాయి రెడ్డి పర్యటించారు. ఆయన స్వగ్రామం,దత్తత గ్రామమైన తాళ్లపూడిలో 13 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అందుకోసం గ్రామీణాభివృద్ధి పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నా, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తాను తాళ్లపూడికే కాకుండా జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.
ఇవీ చదవండి