నెల్లూరు జిల్లా ఎస్పీగా విజయరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా ఉన్న విజయరావు బదిలీపై నెల్లూరుకు వచ్చారు. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎస్పీ.. జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు తన వంతు కృషి చేస్తానని కొత్త ఎస్పీ అన్నారు.
కేసుల సత్వర పరిష్కారంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలీసులంతా ఓ బృందంగా కలిసి విధులు నిర్వహిస్తూ.. అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుని, దిశ యాప్‌ను ప్రతి ఒక్కరు డౌన్ లోడ్ చేసుకునేలా చూస్తామన్నారు.
ఇదీ చదవండి: