నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చబోలు గ్రామంలో వాలంటీర్ కత్తి లక్ష్మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వృద్ధులకు, వితంతువులకు పంపిణీ చేసే పింఛన్లో కమిషన్ తీసుకుంటూ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసుగెత్తిపోయిన బాధితులు గ్రామ వాలంటీర్ కత్తి లక్ష్మీపై ఇటీవల ఎంపీడీవోకి ఫిర్యాదు చేశారు.
అయితే ఎంపీడీవో పట్టించుకోకపోవడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తి లక్ష్మీపై వెంటనే చర్యలు తీసుకోవాలని మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి: