ETV Bharat / state

నెల్లూరులో యూరియా కష్టాలు.. సరిపడా ఇవ్వడం లేదని రైతుల ఆవేదన - వరికి యూరియా అందుబాటులో లేదు

Urea Not Available: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సొసైటీ భవనం వద్ద సరిపడా ఎరువులు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన చేశారు. ఎకరాకు ఆరు బస్తాలు అవసరమైతే అరబస్తా కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Urea
యూరియా
author img

By

Published : Jan 4, 2023, 5:44 PM IST

Updated : Jan 4, 2023, 7:10 PM IST

Urea Not Available: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఎకరాకు ఆరు బస్తాలు అవసరమైతే అరబస్తా కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానా అగచాట్లు వరి నార్లు వేస్తే సమయానికి యూరియా అందుబాటులోకి రావటం లేదని వచ్చిన అరకొర యూరియా సరిపోవటం లేదని.. గ్రామంలోని సొసైటీ భవనం వద్ద తమకు సరిపడా ఎరువులు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. సమయం అయిపోయిన తరువాత వేసి ప్రయోజనం ఉండదని‌ అటు పొలం పనులు చేసుకోలేక యూరియా కోసం పడికాపులు కాయలేక నాన అవస్థలు పడాల్సివస్తుందని రైతులు ఆవెేదన చెందుతున్నారు. మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం ఉదయం నుండి ఎండలో రైతులు బారులు తీరి సాయంత్రం వరకు లైన్​లో ఉన్నా ఒక్క యూరియా బస్తా కూాడా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరులోని రైతులకు యూరియా కష్టాలు

రైతులకు రెండు బస్తాలు మూడు బస్తాలు ఇస్తున్నారు. ఎక్కువ జనాలు వస్తున్న కారణంగా తక్కువ సరకొస్తుంది.. మేము అందరికీ అందించలేం.. ఒకరికి రెండు బస్తాలు, మూడు బస్తాలు ఇవ్వగలమని చేతులెత్తేస్తున్నారు. యూరియా ఎంతొస్తుందో, ఎంత పోతుందో మాకు తెలియదు. అధికారులైతే మరీ దారుణం చేస్తున్నారు. దీనివల్ల రైతులు భయంకరంగా బాధపడుతున్నారు.- రైతు

కౌలుకు 18 ఎకరాలు నాటాను ఒకేసారి పాస్​బుక్ తెమ్మంటే కౌలుకు చేసేవారికి ఎవరిస్తారు. రికమెండేషన్​లకు ఇస్తున్నారు, మేమొస్తే ఇవ్వట్లేదు మేమేం చేయాలి.- రైతు

ఇవీ చదవండి:

Last Updated : Jan 4, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.