ETV Bharat / state

సీఎం జగన్.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు: కేంద్రమంత్రి మురుగన్ - Union Minister visit to Nellore

Union Minister Murugan Comments: కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి మురుగన్ నెల్లూరులో పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. వాటి భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Murugan
మురుగన్
author img

By

Published : Mar 5, 2023, 8:13 PM IST

Union Minister Murugan Comments: నెల్లూరులో కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి దయాకర్ రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి బ్రహ్మానందంలను గెలిపించాలని నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ చేస్తున్న మంచిని వివరిస్తూ.. తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏవి?: అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్.. పాదయాత్ర సమయంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన హామీని నెరవేర్చలేదని కేంద్ర మంత్రి మురుగన్ విమర్శించారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

అవకాశాలు రావడం లేదు: గత తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 కి పెంచితే, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 60 నుంచి 62 కు పెంచడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన గురించి చెప్పారని.. స్వాతంత్ర దినోత్సవం నాడు మాట ఇచ్చారని.. సంవత్సరంలోపు పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. నేడు ఆ దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేస్తూ, నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తేందుకు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

APUS Mahasabha: అదే విధంగా.. విద్యారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి మురుగన్ వెల్లడించారు. నెల్లూరు నగరం కస్తూరిభా కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ మహాసభకు పలువురు ఉపాధ్యాయ సంఘం నేతలతో పాటు బీజేపీ నేతలు హాజరయ్యారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మురుగన్ అన్నారు.

విశ్వ గురువుగా భారత్: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మాతృభాషలో విద్యాబోధన జరిగేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2014కు ముందు దేశంలో ఏడు మాత్రమే ఉన్న ఎయిమ్స్ కళాశాలను ప్రధాని మోదీ వచ్చాక 22కు పెంచారని, 387 మెడికల్ కళాశాలలుంటే.. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయించారని తెలిపారు. 2047 నాటికి భారత్ విశ్వ గురువుగా ఆవిర్భవించేలా పటిష్ట ప్రణాళికలతో ముందుకు వెలుతోందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.