నెల్లూరులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐదు కార్లతో పాటూ 250 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. తోటపల్లి గూడూరు మండలానికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి పలువురు దగ్గర కార్లను అద్దెకు తీసుకొని.. తిరిగి ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకుంటూ జల్సాలు చేసేవాడని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదైనందున అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ ఇంటి సతీష్ అనే దొంగనూ అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం, 250 గ్రాముల బంగారు ఆభరణాలు, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో దొంగలను పట్టుకునేందుకు ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రివార్డులు అందజేశారు.
అద్దెకు కార్లు.. ఆ తర్వాత అమ్మేస్తున్న మాయగాడు
విలువైన కార్లే అతడి లక్ష్యం. కొన్ని రోజుల్లో తిరిగిస్తానని కార్లు అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తాడు. మరొకడు తాళం వేసిన ఇళ్లు కనబడితే చాలు కన్నం వేసి సొత్తు అంతా దోచేస్తాడు. ఇలా వివిధ కేసుల్లో నిందితులైన ఇద్దరు దొంగలను నెల్లూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా వాహనాలను, సొత్తును స్వాధీనం చేసుకున్నారు.