నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాల పల్లి గ్రామానికి చెందిన బుజ్జయ్య, వరలక్ష్మి అనే గిరిజన దంపతుల మూడేళ్ల కుమారుడు సంజూ... 4 రోజుల క్రితం తండ్రితో పాటు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్లాడు. తండ్రితో పాటే నడుస్తున్న బాలుడు కొద్ది దూరం వెళ్లాక తప్పిపోయాడు. గమనించిన తండ్రి చుట్టూ ఎంత వెతికినా దొరక్కపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది మరో వంద మంది గ్రామస్థులు మూడు రోజులుగా అటవీ ప్రాంతమంతా వెతికారు. రెండు రోజులపాటు డ్రోన్ కెమెరాతో కూడా పరిశీలించారు. అయినా ఫలితం లేదు. నేటికీ పోలీస్ సిబ్బంది తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. తమ బిడ్డ ఎక్కడో ఓ చోట జీవించే ఉంటాడని బాలుని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: