శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలంలోని పూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఓ కారు... ద్విచక్రవాహనం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతులు నెల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు చెన్నై నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో ఒకరు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఇదీచదవండి.