ETV Bharat / state

నెల్లూరులో సీఎం పర్యటన.. అడ్డుకునేందుకు సిద్ధమైన కార్మికులు.. ఎందుకంటే..! - Nellore Latest News

Protest: కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్​ నిర్మాణం పూర్తయిన మూడో యూనిట్​ను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రైవేటు పరం చేయవద్దంటూ కార్మికులు చేస్తున్న ఆందోళన ఉద్ధృతం చేశారు. అందులో భాగంగా రేపు సీఎం పర్యటనను అడ్డుకునేందుకు కార్మికులు సమాయత్తం అవుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 26, 2022, 10:28 PM IST

Updated : Oct 27, 2022, 7:20 AM IST

నెల్లూరులో సీఎం పర్యటన.. అడ్డుకునేందుకు సిద్ధమైన కార్మికులు

Krishnapatnam thermal power plant Workers Protest: ముఖ్యమంత్రి జగన్‌ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అదే సమయంలో థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయవద్దంటూ గొంతు ఎత్తుతున్న కార్మికులు , ప్రజాసంఘాల నాయకులు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. సీఎం పర్యటనను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్‌.. శ్రీ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి ఒంటిగంట 10 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు. సీఎం పర్యటన రీత్యా ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.

నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన వేళ కార్మిక, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేట్ పరం చేయవద్దంటూ 278రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు.. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రైవేటుపరం చేసే ప్రక్రియను వెంటనే ఆపాలని.. లేకుంటే సీఎం నెల్లూరు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఆ సంస్థ పరిరక్షణ కమిటీ హెచ్చరించింది.

థర్మల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం నెల్లూరులోని ముత్తుకూరు బ్రిడ్జి కూడలిలో పరిరక్షణ కమిటీ, ఐకాస, వామపక్ష పార్టీలు, తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 23వేల కోట్ల థర్మల్‌ప్లాంట్‌ను అప్పనంగా ప్రైవేటు సంస్థకు అప్పగించాలనుకోవడం దారుణమన్నారు. జెన్‌కోను ఉద్దేశపూర్వకంగా నష్టాలబాట పట్టించి.. ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్​ని అదానీప్రదేశ్‌గా మార్చేస్తారా?అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అదానీకి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.

కృష్ణపట్నం నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నిర్ణయించింది. సంస్థ పరిధిలోని సుమారు 25వేల కోట్ల విలువైన కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్లను ప్రైవేటుకు అప్పగించే ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంతో 25 ఏళ్లపాటు ప్లాంట్ల నిర్వహణ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుంది. వాటి జీవితకాలం పూర్తయ్యాక వెనక్కి తీసుకున్నా ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. ఒకవైపు సిబ్బంది విలీనంతో ఆర్టీసీకి ఊతమిచ్చి.. మరోవైపు వెలుగులు పంచే ఏపీ జెన్‌కోను చీకట్లోకి నెట్టడం ఏంటని.. ప్రశ్నిస్తున్నారు.

కృష్ణపట్నం ప్లాంటును కనీసం 85 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నిర్వహిస్తే నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. దీనికి అవసరమైన బొగ్గును సమయానికి అందిస్తే ప్రైవేటు సంస్థలు ప్రతిపాదించే ధర కంటే తక్కువకే ఇస్తామని చెబుతున్నాయి. బొగ్గు సమకూర్చకుండా యూనిట్‌ ధర ఎక్కువన్న సాకుతో ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 27, 2022, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.