ETV Bharat / state

'పప్పు, శనగలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం' - నెల్లూరు జిల్లా మార్క్​ఫెడ్ వార్తలు

రబీ సీజన్​లో పండించిన పప్పు, శనగలు ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తామని నెల్లూరు జిల్లా మార్క్​ఫెడ్ అధికారులు చెబుతున్నారు.

buy crops
మార్క్​ఫెడ్
author img

By

Published : Mar 8, 2021, 6:35 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు తదితర మండలాల్లో ఎక్కువగా పప్పు, శనగ పంట సాగు చేస్తారు. ఈ రబీ సీజన్​లో ఇప్పటికే 25 వేల ఎకరాలు ఈ క్రాప్​లో నమోదు చేశారు. 4,861 మంది రైతులు ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐదు ఎకరాల పొలం ఉన్న రైతుల వద్ద కొనుగోలు చేస్తామని మార్క్​ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల వద్ద కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని 13 మండలాల్లో 200 రైతు భరోసా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రతి రైతు వద్ద శనగల కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని సూచిస్తున్నారు.

జొన్నలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హైబ్రిడ్ రకానికి చెందిన జొన్నలు క్వింటాకు రూ. 2620, సాధారణ రకానికి రూ.2640 చెల్లిస్తాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శనగలు కొనుగోలు చేసిన 15 రోజులకి రైతులకు నగదు జమ చేస్తాం. బస్తాలు, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. మార్చి 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. - నాగ రాజేశ్వరి , జిల్లా మార్క్​ఫెడ్ మేనేజర్

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో ఆరు నెలల బాలుడి కిడ్నాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.