నెల్లూరు జిల్లా డక్కిలి మండలం కుప్పయపాలెం వంతెనపై ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వెంకటగిరిలోని శ్రీచైతన్య పాఠశాలకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను డక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4285175_dd.jpg)