Tension in abvp rally at atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏబీవీపీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలంటూ.. ఏబీవీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్, విద్యాశాఖ మంత్రి డౌన్‌డౌన్ అంటు నినాదాలు చేశారు.
స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి.. మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తున్న ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో.. పోలీస్ స్టేషన్ ఎదుట తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారు.
abvp rally at atmakur: ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై ఏబీవీపీ నేతలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి..
Employees Protest: ఉద్యోగుల పోరుబాట.. నల్ల బ్యాడ్జీలతో రెండోరోజూ నిరసనలు