మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నిర్వీర్వం చేస్తోందని తెలుగు యువత ఆరోపించింది. 3 రాజధానులపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తూ నెల్లూరులో తెలుగు యువత నాయకులు న్యాయస్థానం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతోపాటు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని జిల్లా కోఆర్డినేటర్ తిరుమల నాయుడు విమర్శించారు. 3 రాజధానుల విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చినట్లు, రాజధానిని మార్చాలని చూడడం తగదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...