ETV Bharat / state

సీఎం జగన్​ను గాంధీతో పోల్చటంపై తెదేపా నిరసన

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని మహాత్మ గాంధీతో పోలుస్తూ ఓ పత్రికలో ప్రచురితమైన వ్యాసంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. దీనిపై సీఎం క్షమాపణ చెప్పాలంటూ నెల్లూరులో నిరసన చేపట్టారు.

tdp protest in nellore
tdp protest in nellore
author img

By

Published : Oct 4, 2020, 6:54 PM IST

ముఖ్యమంత్రి జగన్​ను గాంధీ మహాత్మునితో పోల్చడాన్ని ఖండిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టింది. నగరంలోని గాంధీ విగ్రహాన్ని సుగంధద్రవ్యాలతో శుభ్రం చేసిన తెదేపా నేతలు... మన్నించు మహాత్మా అంటూ పొర్లుదండాలు పెట్టారు. మహాత్మా గాంధీ జాతిపిత అయితే... ముఖ్యమంత్రి జగన్ అవినీతి పితామహుడని తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. జగన్​ను గాంధీతో పోల్చిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని... ఈ వ్యాసం ప్రచురించిన పత్రికపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓ పక్క రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ... మరోపక్క ముఖ్యమంత్రి తన అనుచరుల మద్యాన్నే అధిక ధరలకు విక్రయిస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. గాంధీ కలలను రాష్ట్రంలో సీఎం జగన్ సాకాారం చేస్తున్నారనటంలో అర్థం లేదన్నారు. 11 కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మహాత్మునితో పోల్చడం హాస్యాస్పదమన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.