నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్లను అరెస్టు చేయటం వెనుక ముఖ్యమంత్రి కక్షపూరిత ధోరణి ఉందని ఆరోపిస్తూ ఆందోళనలు చేశారు.
ఎన్టీఆర్ కాలనీ నుంచి క్రాస్ రోడ్డు వరకు తెదేపా శ్రేణులు కాగడాల ప్రదర్శన సాగించారు. తెదేపా నాయకులపై కేసులు తొలగించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి