రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో తేదేపా నేతలు నిరసన చేపట్టారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర తేదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మౌన దీక్ష చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల కేటగిరీల శ్లాబులు మార్చి, పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.
లాక్ డౌన్ సమయంలో పెరిగిన బిల్లులు కట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవరత్నాల పథకాల అమలు కోసమే విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి: