వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అసెంబ్లీలో వైకాపా నేతలు పట్టించుకోకుండా డ్రామాలు చేస్తున్నారని తేదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. ప్రజలను, రైతులను ఆదుకోవాలని... ప్రతిపక్ష నేత చంద్రబాబు అడిగితే, స్పందించడం లేదని మండిపడ్డారు. ఇసుకను కొల్లగొట్టిన తీరుతో గ్రామాలు, కాలనీలను వరద ప్రవాహం ముంచెత్తిందని దుయ్యబట్టారు. అర్చకులపైనా దాడికి పాల్పడటం వైకాపా అరాచక పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు.. రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం