ETV Bharat / state

'శరత్​ చంద్రను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎందుకు కలిశారు' - ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు

Anam Venkata Ramana Reddy: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణలో ఉన్న శరత్​ చంద్రను.. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎందుకు కలిశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేను సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారించాలన్నారు.

Anam Venkata Ramana Reddy
ఆనం వెంకటరమణారెడ్డి
author img

By

Published : Nov 22, 2022, 3:44 PM IST

Anam Venkata Ramana Reddy: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న శరత్ చంద్రను కలవాల్సిన అవసరం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఏంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారించాలని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన డిమాండ్​ చేశారు. తమ పేర్లు బయటపడకుండా ఉండాలని.. శరత్​ చంద్రను భయపెట్టడానికి అతనిని కలిశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు విజయవాడ ఎయిర్​పోర్టు నుంచి దావోస్​కు వెళ్లకుండా.. బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.