ETV Bharat / state

'అక్రమాలపై పట్టింపేదీ? మాజీ మంత్రి దీక్షలపై స్పందనేదీ?: అధికారులను నిలదీసిన టీడీపీ నేతలు - tdp leaders meet nellore joint collector

TDP Janasena Leaders Support to Somireddy Initiation: నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్​పై మాజీ మంత్రి సోమిరెడ్డి చేపట్టిన దీక్షకు పలువురు టీడీపీ, జనసేన నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి అక్రమాలు జరుగుతున్నాయని దీక్షలకు దిగినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నించారు.

janasena_leaders-_support_to_somireddy_initiation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 4:43 PM IST

TDP Janasena Leaders Support to Somireddy Initiation: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడోరోజూ సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నారు. మైనింగ్‌ నిర్వహిస్తున్న ప్రాంతంలోనే దీక్ష చేపట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డికి పలువురు టీడీపీ, జనసేన నేతలు మద్దతు ప్రకటించారు. అక్రమ మైనింగ్‌పై ఎందుకు స్పందించడం లేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అధికారులను నిలదీశారు.

అక్రమ మైనింగ్​పై అధికారులు ఎందుకు స్పందించడం లేదని నెల్లూరు జిల్లా అధికారులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే న్యాయం కోసం పోరాటం చేస్తామని టీడీపీ నేతలు అధికారులను హెచ్చరించారు.

బస్తాల కొద్ది పేలుడు పదార్థాలు​ అధికారులకు కనిపించడం లేదా: మాజీ మంత్రి సోమిరెడ్డి చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన క్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, మంత్రి కాకాణి ఇలాఖాలో క్వార్ట్జ్ అక్రమంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్​కు అనుమతి లేదని, పేలుడు పదార్థాలకు అసలే అనుమతి లేదని అన్నారు. జనసేన సమావేశాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించిన అధికారులకు.. ఇక్కడ ఇంత అక్రమాలు జరుగుతుంటే కనిపించడం లేదా అని జనసేన నాయకుడు అజయ్‌ మండిపడ్డారు.

మైనింగ్​పై సోమిరెడ్డి ఫిర్యాదు చేస్తే కింది స్థాయి అధికారి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతార్ చేస్తున్నారని వాపోయారు. బస్తాల కొద్ది జిలిటెన్​ స్టిక్స్​ ఉన్నాయని, ఈ పేలుడు పదార్థాలు నక్సలైట్ల చేతికిపోతే పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. అక్రమ మైనింగ్​లో కొందరు ప్రభుత్వాధికారులకు కూడా వాటాలున్నాయని ఆరోపించారు. పేలుడు పదార్థాలు ఉన్న కూడా పోలీసులు రాకపోవడంపై అనుమానం కలుగుతోందని అన్నారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్​తో రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్‌ దోపిడీ - సీఎం జగన్‌కు, మంత్రులకు వాటా: సోమిరెడ్డి

అక్రమ మైనింగ్​పై అధికారుల మౌనం ఎందుకు : జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నెల్లూరు జాయింట్​ కలెక్టర్​ను టీడీపీ నేతలు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్​ను, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్​ అజీజ్, రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి​ సహా పలువురు నేతలు కలిశారు. అక్రమంగా మైనింగ్​ జరుగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని అడిగారు.

అధికార పార్టీకి అధికారులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్​ రెడ్డి కోరారు. మైనింగ్​ అంశం టీవీల్లో పత్రికల్లో ప్రచురితం అవుతున్నా అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. మాజీ మంత్రి మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో దీక్ష చేపట్టినా అధికారులు ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు.

మైనింగ్​ నిర్వహస్తున్న ప్రాంతంలో గిరిజనుల ఆవాసాలు ఉన్నాయని, మైనింగ్​ మాఫియా పేలుళ్ల ధాటికి వారి గృహలు ధ్వంసమవుతున్నాయని వివరించారు. అక్కడి ప్రజల ప్రాణాలకు ఏదైనా నష్టం కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారని జాయింట్​ కలెక్టర్​ను​ ప్రశ్నించారు. మైనింగ్​ అధికారులు తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.​ ఈ క్రమంలో అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకుంటామని మైనింగ్​ అధికారులు చెప్పడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.

వైఎస్సార్సీపీ నేతల గుప్పిట్లో సిలికా - క్వార్ట్జ్‌ వ్యాపారం - తనిఖీల పేరిట వందల కోట్లలో దోపిడీ

సోమిరెడ్డికి జనసేన మద్దతు: పొదలకూరు మండలం వరదాపురంలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్​పై మాజీ మంత్రి సోమిరెడ్డి చేపట్టిన దీక్షకు జనసేన నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్​ కుమార్​ ఈ మేరకు సోమిరెడ్డిని కలిశారు. మైనింగ్​ జరుగుతున్న ప్రాంతాన్ని సోమిరెడ్డితో కలిసి అజయ్​ కుమార్​ పరిశీలించారు.

మూడు రోజులుగా మాజీ మంత్రి అక్రమ మైనింగ్​పై పోరాటం చేస్తున్నా ఒక్క అధికారి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న సోమిరెడ్డికి జనసేన మద్దతు ఉంటుందని ప్రకటించారు. మైనింగ్​ ద్వారా భారీ దోపిడీ జరుగుతుందని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణమన్నారు.

క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష- సంఘీభావం తెలిపిన టీడీపీ, జనసేన నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.