CBN NELLORE TOUR : నెల్లూరు జిల్లా సింగరాయకొండలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. సింగరాయకొండ బైపాస్ నుంచి బైక్ ర్యాలీగా చంద్రబాబు కందుకూరుకు బయలుదేరారు. కందుకూరులో జరగనున్న'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' బహిరంగ సభకు హాజరవుతారు. అంతకుముందు సింగరాయకొండ చేరుకున్న బాబు.. అండర్ పాస్ వద్ద టీ స్టాల్‌లో టీ తాగారు. అక్కడ చిరు వ్యాపారులతో ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు టీస్టాల్ నిర్వాహకురాలు తెలిపారు.
ప్రకాశం జిల్లా కొండెపి టోల్‌గేట్ వద్ద భారీ గజమాలతో స్వాగత ఏర్పాట్లు: అంతకుముందు నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దారి పొడవునా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు స్వాగతం పలికారు. కొండెపి టోల్‌గేట్ వద్ద దామచర్ల సత్య భారీ గజమాలతో స్వాగతోత్సవ ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: