ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బందే... ఆ ఆసుపత్రిలో వైద్యులు - నెల్లూరులో వెంటాచలం ఆసుపత్రి లేటెస్ట్ న్యూస్

రూ.4.33 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనం అలంకారప్రాయంగా మారింది. అధునాతన భవనాలు, అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పటం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులకు పారిశుద్ధ్య సిబ్బందే వైద్యం చేయడం కొసమెరుపు.

వెంకటాచలం ఆసుపత్రి
author img

By

Published : Nov 7, 2019, 5:14 PM IST

పారిశుద్ధ్య సిబ్బందే... ఆ ఆసుపత్రిలో వైద్యులు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటైన ఆస్పత్రి... సిబ్బంది కొరతతో వైద్యసేవలు అందించలేక రోగులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బంది లేక పారిశుద్ధ్య సిబ్బందే రోగులకు సేవలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం చేయాల్సిన సిబ్బంది... ఓపీలు రాయటం, గాయాలకు కట్లు కట్టటం, సెలైన్ బాటిల్స్ ఎక్కించటం లాంటి పనులు చేస్తున్నారు.

ఒక్కరే వైద్యులు
వెంకటాచలం మండలానికే చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు... కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆస్పత్రి నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. రూ. 4.33కోట్లు మంజూరు కాగా... అధునాతన భవనాలు, ఖరీదైన వైద్య పరికరాలతో 2018లో సామాజిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చుట్టుపక్కల 10గ్రామాల్లోని 50వేల మంది జనాభాకు వైద్య సేవలందుతాయని ఆశించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్నందున అత్యవసర వైద్యానికీ సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 మంది వరకూ వైద్యులు, 18మంది నర్సులు అవసరం కాగా... ఒకే ఒక్క డాక్టర్‌ ఉన్నారు. ప్రస్తుతం ఆమె కూడా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. నర్సులైతే అసలే లేని పరిస్థితి. ఆస్పత్రిలో ఉన్న యునాని వైద్యురాలే ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు.

కృషి నిరూపయోగం
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య చేసిన కృషి.. సిబ్బంది కొరతతో నిరూపయోగంగా మారింది. కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలు ఉన్నా పేదలకు మాత్రం నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.