ETV Bharat / state

తండ్రి మందలించాడని.. ఆ కొడుకు ఏం చేశాడంటే? - crime updates in ap

BIKE : చాలా మంది యువత.. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారనో లేకపోతే కొట్టారనో కారణంతో ప్రాణాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఓ తండ్రి అలానే కొడుకును మందలించాడు. అయితే ఆ యువకుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. తండ్రి తిడితే ఆ కొడుకు ఏం చేశాడో మీరు చదివేయండి..

BIKE BURNT
BIKE BURNT
author img

By

Published : Dec 24, 2022, 12:11 PM IST

BIKE BURNT : తమ పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా మంచి అలవాట్లను అలవరచుకోవాలని తల్లిదండ్రులు నిత్యం తపిస్తుంటారు. అలానే వాళ్లు చేసే పనులు మంచిగా లేకపోతే మందలిస్తారు. కొద్దిమంది తల్లిదండ్రుల మాటలు వింటే.. చాలా మంది వాళ్లు తిట్టడం నచ్చక మనస్తాపానికి గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా ఓ తండ్రి అలానే కొడుకును మందలించాడు. తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన కొడుకు.. తన సొంత బైక్​కే నిప్పంటించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో చోటుచేసుకుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై కేక్ కట్ చేయడం ఏమిటని కొడుకును మందలించడంతో ఆగ్రహం చెందిన కుమారుడు తన బైక్​కు తానే నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా దగ్ధమైంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.