వైకాపా పాలనలో ప్రశ్నిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై కేసులు నమోదయ్యాయన్నారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ఎవరి అనుమతితో అప్లికేషన్ తయారు చేశారని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. అప్లికేషన్ తయారు చేసిన సంస్థ శేశ్రిత నెల్లూరులో ఉంటే ముత్తుకూరులో కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీశారు.
జరుగుతున్న పరిణామాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా..వీలు కావటం లేదన్నారు. గతంలో పోర్జరీ పత్రాలు సృష్టించి తమపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. అప్లికేషన్ తయారు చేసేందుకు శేశ్రిత సంస్థకు ఎవరు అనుమతి ఇచ్చారో కలెక్టర్ అయినా ప్రకటించాలని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
Anandaiah Medicine:'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభమైంది..ఎక్కడంటే !