ఆత్మహత్యాయత్నం చేసిన తురిమెల్ల గ్రామ రైతు వెంకటరత్నాన్ని నెల్లూరు ఆసుపత్రిలో తెదేపా నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రైతుకు అందడంలేదని సోమిరెడ్డి విమర్శించారు. రైతు వెంకటరత్నం గిట్టుబాటు ధర లభించకే ఆత్మహత్యయత్నం చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహణ సరిగాలేదని.. రైతును నాయకులు, బ్రోకర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: