నెల్లూరు జిల్లా ఆత్మకూరు మహిళా ఎస్సై రోజాలత అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న ప్రసాద్ అనే విలేకరునిపై లాఠీ ఝళిపించారు. లాక్డౌన్ నేపథ్యంలో గ్రీన్‌జోన్ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితులపై విజువల్స్ తీస్తుండగా ఆయనపై దాడి చేశారు. ఘటనపై బాధితుడు ఆత్మకూరు సర్కిల్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన ఆయన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి స్పందన
ఈ ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.