Half a kilo of chicken for a five paise coin: ఆత్మకూరు పట్టణ ప్రజలకు 786 చికెన్ షాప్ నిర్వాహకులు భలే ఆఫర్ ఇచ్చారు. ఐదు పైసల నాణానికి అరకేజీ చికెన్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 786 చికెన్ స్టాల్ నిర్వాహకులు ఈ ప్రాంత ప్రజలకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు.. ఆదివారం నాడు తన చికెన్ షాప్‌లో ఐదు పైసలకు అర కేజీ చికెన్ ఇస్తానంటూ ప్రకటన చేశారు. దీంతో ఆత్మకూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఐదు పైసల నాణానికి తీసుకొని షాప్‌కి చికెన్ తీసుకునేందుకు తరలివచ్చారు.. నేటి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందించారు. ఒక ఐదు పైసలు బిళ్ళకు అరకేజీ చొప్పున ఒక మనిషికి రెండు బిళ్లలు తీసుకువస్తే కేజీ చికెన్ ఇచ్చే విధంగా ప్రకటన చేయడంతో చాలామంది తమ వద్ద దాచుకొని ఉన్న ఐదు పైసల బిళ్ళలను తీసుకొని షాపు వద్దకు వచ్చి ఒక్కో బిళ్లకు అరకేజీ చికెన్ చొప్పున ఉచితంగా అందుకొని వెళ్లారు.
ఆత్మకూరు పట్టణంలోని 786 చికెన్ షాప్ నిర్వాహకులు గత 12 ఏళ్లుగా చికెన్ షాపు నిర్వహిస్తూ ఇటీవల పట్టణంలోని వాటర్ ప్లాంట్ సమీపంలో తమ నూతన బ్రాంచ్‌ను ఇటీవల ప్రారంభించారు ఈ షాపు ప్రచారం కోసం ఈ ఆఫన్ను ప్రకటిస్తూ ప్రజలు మరిచిపోయిన పురాతన పాత నాణాలను గుర్తు తెచ్చేందుకు వాటి విలువను తెలిపేందుకే తాము ఈ ఆఫర్‌ను పెట్టినట్టు దీనిపై స్పందించి ఐదు పైసల బిళ్లలను తీసుకొని జనం భారీగా వచ్చారని వారందరికీ కూడా తెచ్చిన ఐదు పైసల బిళ్లకు చికెన్ ఇచ్చినట్టు షాప్ నిర్వాహకులు షఫీ, అహ్మద్ తెలిపారు.. ఐదు పైసలకు 1/2 కేజీ చికెన్ అంటూ షాపు వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో చికెన్ కోసం ఎక్కడెక్కడో దాచుకున్న ఐదు పైసల బిళ్ళలు అందుకొని జనం భారీగా ఈ షాపుకు వచ్చారు. షాపు యజమాని ఆలోచన ఎలా ఉన్నా ఈ ఆఫర్‌తో తమకు మాత్రం ఈ ఆదివారం నాడు 5 పైసలకే అరకేజీ చికెన్ లభించడంతో ప్రజలు ఆనందంతో చికెన్ అందుకొని వెళ్లారు.
దాదాపు పన్నెండు సంవత్సరాలుగా 786 చికెన్ దుకాణం నిర్వాహిస్తున్నాం.. కొత్తగా వేరే బ్రాంచ్‌ను పట్టడం జరిగింది.. ప్రతి సంవత్సరం కస్టమర్స్‌కి ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పుర్తయిన సందర్బంలో ఇప్పుటు ఏంటంటే ఈ ఆదివారం ఐదు పైసలకి అరకిలో చికెన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.. చాలా మంది కస్టమర్స్ స్పందించారు.. చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలానే ప్రతి ఆదివారస ఏదో ఒక ఆఫర్ పెడుతూనే ఉంటాం.- షఫీ, చికెన్ దుకాణం నిర్వాహకులు
ఇవీ చదవండి: