బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు అక్రమంగా తరలిస్తున్న 384 టెట్రా మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను ఉదయగిరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్రిపాడు మండలం బాట సింగనపల్లె ప్రాంతంలో కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం పట్టుబడినట్లు ఎస్ఈబీ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ క్రమంలో పామూరు ఎన్జీవో కాలనీకి చెందిన షేక్ చాంద్ బాషా, షేక్ హజరత్ సెబ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న విషయాన్ని తెలుసుకొని.. బస్సులో తరలిస్తున్న మద్యం ప్యాకెట్లను మర్రిపాడు మండలం సింగన్నపల్లి వద్ద దింపేసి.. బస్సు షెల్టర్లో దాచి ఉంచారు. విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని.. ఉదయగిరి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...