నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మద్యం దుకాణాల వద్ద రెండో రోజు కూడా మద్యం ప్రియులు బారులు తీరారు. కాశీపేట వీధిలో ఉన్న దుకాణం వద్ద రద్దీ మరింత పెద్దగా ఉంది. దుకాణాలు ఎప్పుడు తెరిచేది స్పష్టత లేకపోయినా మద్యం ప్రియులు మాత్రం మండుటెండలో నిరీక్షిస్తున్నారు.
మరోవైపు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా.. దుకాణాల వద్దకు చేరుకొని అందరూ సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మద్యం ధరలను పెంచడాన్ని సైతం వారికి వివరించారు.
ఇవీ చూడండి: