తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయం వద్ద పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా రూ.50 లక్షల బీమా మొత్తం పూర్తి చేయాలన్నారు. నవంబర్ నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలన్నారు. కార్మికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిఫామ్, ఇతర వస్తువులను సరఫరా చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చేనెల నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభించిన సీఎం