నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద సాగర మిత్ర ఉద్యోగాలకు నియామకాలు చేపట్టారు. జిల్లాలోని 85 ఉద్యోగాలకు 466 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 351 మందిని అర్హులుగా గుర్తించారు. ముఖాముఖి ఇంటర్వ్యూల అనంతరం తుది జాబితా ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
'మధ్యతరగతి ప్రజలపై మానవత్వం లేకుండా జగన్ కక్ష సాధిస్తున్నారు'