నెల్లూరు జిల్లా ఆత్మకూరు గత ప్రభుత్వంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు 14 నెలల గౌరవ వేతన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కోరారు. జడ్పీ మాజీ ఛైర్మన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు బకాయిలు ఉన్న రూ. 200 కోట్లను గౌరవ వేతనంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి లక్ష వరకు..
రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీలు 660, ఎంపీటీసీలు 9984, సర్పంచ్లు 12,924 మందికి ఒక్కొక్కరికి రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉందని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు.
వెంటనే చెల్లించాలి..
గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధుల్లో సుమారు 60 నుంచి 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేదలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. బకాయిలను వెంటనే చెల్లించి కరోనా నేపథ్యంలో వారిని ఆదుకోవాలని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్