ETV Bharat / state

'అక్రమ లేఔట్ల వల్ల వైసీపీకి చెడ్డ పేరు వస్తోంది' - Nellore district News

Illegal Layouts in Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అనధికార లేఔట్లను కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​ పరిశీలించారు. అక్రమ లేఔట్లను అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనివల్ల అధికార పార్టీ నేతలకు, కౌన్సిలర్లకు చెడ్డ పేరు వస్తోందన్నారు.

YCP councillors
అధికార పార్టీ కౌన్సిలర్లు
author img

By

Published : Nov 22, 2022, 7:27 PM IST

Illegal Layouts in Atmakur: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో అనధికారికంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ లేఔట్లను ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్​ షేక్ సర్ధార్.. మున్సిపల్​ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. లేవుట్​ల ముసుగులో కోట్లాది రూపాయలు అక్రమార్కులు కొల్లగొడుతున్నారని.. అవేవీ అధికారులు పట్టించుకోవటం లేదని వైసీపీ కౌన్సిలర్లు ఆత్మకూరు తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. ఆత్మకూరులో అనధికార లేఔట్ల వ్యాపారం జరుగుతోందని వైసీపీ కౌన్సిలర్​ సురా భాస్కర్ రెడ్డి అరోపించారు.

పట్టణంలో 33 లే అవుట్​లకు మున్సిపల్, రెవెన్యూ శాఖల పర్మిషన్లు లేకున్నా.. రిజిస్ట్రేషన్​ల ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నారని అన్నారు. అక్రమ లేఔట్లను మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమ్​రెడ్డితో పాటు వైసీపీకి చెడ్డపేరు వస్తోందన్నారు. ఈ అక్రమ లేఔట్ల వల్ల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ లేఔట్లకు రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని కోరారు.

అక్రమ లేఔట్లను అధికారులు పట్టించుకోకపోవటంతో.. వైసీపీకి చెడ్డ పేరు వస్తోంది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.