నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు.. ముందున్న బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 కు సమాచారం అందించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: