ETV Bharat / state

పేద ముస్లింలకు రంజాన్​ తోఫా అందజేసిన దాత - పేద ముస్లిలకు రంజాన్​ తోఫా అందించిన నెల్లూరు జిల్లా దాత

రంజాన్​ పండుగను పురస్కరించుకుని కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో పేద ముస్లింలకు ఓ దాత కొత్త దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాదాపు 200 మంది ముస్లింలకు ఈ తోఫాను అందజేశారు.

ramzan thofa given to poor muslims by donor vijyakumar
పేద ముస్లింలకు రంజాన్​ తోఫా ఇచ్చేందుకు ముందుకొచ్చిన దాత
author img

By

Published : May 25, 2020, 11:38 AM IST

పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. దాత విజయకుమార్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. దాదాపు రెండు వందల మంది ముస్లింలకు ఈ తోఫాను అందజేశారు. కులమతాలకు అతీతంగా ముఖ్య పండుగల సమయంలో విజయకుమార్ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ, పేదలకు చేయూతనందిస్తున్నారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ఆయన్ను కొనియాడారు.

ఇదీ చదవండి : ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.