ETV Bharat / state

మాజీ ప్రధాని రాజీవ్​గాంధీకి ఘన నివాళులు - rajive gandhi death anniversary programme at kalyanadurgam

దివంగత మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. రాజీవ్​గాంధీ చేసిన సేవలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

రాజీవ్​గాంధీకి ఘన నివాళులు
రాజీవ్​గాంధీకి ఘన నివాళులు
author img

By

Published : May 21, 2020, 11:44 PM IST

నెల్లూరు జిల్లాలో..
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఉదయగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక విధానం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని నాయకులు అన్నారు. ఆయన ప్రధానిగా అమలు చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు దోహదపడ్డాయని వారు తెలిపారు.

కృష్ణాజిల్లాలో...
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆధ్వర్యంలో మైలవరంలో పంచాయతీ మహిళా కార్మికులకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అతి పిన్న వయస్సులో ప్రధాని పీఠాన్ని అందుకొని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి అని బొర్రా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో...

కళ్యాణదుర్గం కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... మహత్మాగాంధీ గ్రామస్వరాజ్యం కోరుకుంటే, ఆయన బాటనే అనుసరించిన యువప్రధానిగా రాజీవ్ గాంధీ పంచాయతి రాజ్ వ్యవస్టను చరిత్రత్మాకమైన చట్టం చేయడానికి రాజ్యాంగంలో 73వ సవరణ, 243 to 243(o)ఆర్టికల్ లతో కేంద్రనిధులు నేరుగా గ్రామ పంచాయతిలోకి చేరే విధంగా చట్టం రూపోందించారని తెలిపారు.

ప్రకాశం జిల్లాలో...
యర్రగొండపాలెంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్. వెంకటేశ్వరరావు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్​గాంధీ దేశానికి ఎనలేని సేవ చేసిన మహోన్నతుడని, సాంకేతిక విప్లవ రంగంలో భారత దేశానికి అభివృద్ధి ఫలాలను అందించాడని కొనియాడారు.

అద్దంకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్​గాంధీ 29 వ వర్ధంతి కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. రాజీవ్​గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేపట్టారు.

ఇదీ చదవండి:స్విగ్గీలో ఆల్కహాల్ హోండెలివరీ షురూ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.