ETV Bharat / state

బలహీనపడిన అల్పపీడనం - ఆకాశం మేఘావృతం - RAIN ALERT IN AP

రెండు రోజులు ఇదే వాతావరణం - 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

Weakened low pressure
Weakened low pressure (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2024, 6:51 AM IST

Updated : Dec 23, 2024, 3:44 PM IST

Rain Alert in AP: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వద్దే ఉండటం వల్ల ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలిపింది. మరో రెండు రోజులపాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.

విశాఖ పోర్టులో మూడో నెంబర్‌ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడి, తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. తర్వాత రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో రెండు రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.

దాదాపు వారం రోజులుగా అల్పపీడనం ప్రయాణం సాగిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా (ఏపీ) తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని అంటున్నారు. దీని ప్రభావంతో దాదాపు అయిదు రోజులుగా మత్స్యకారుల పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి.

అల్పపీడనం ఎఫెక్ట్ - మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన

ALERT : చురుకుగా రుతుపవనాలు - బంగాళాఖాతంలో మరో వాయుగుండం

Last Updated : Dec 23, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.