సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో.. నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో క్రస్ట్ గేట్ల కంప్యూటర్ పరికరం మెురాయించింది. దీంతో మాన్యువల్‌గా గేట్లు ఎత్తటానికి ప్రయత్నించగా.. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జనరేటర్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించగా... జనరేటర్లు సైతం మెురాయించాయి. దీంతో అధికారులు నానా అవస్థలు పడ్డారు. సుమారు గంట పాటు మరమ్మతులు చేసిన అనంతరం.. 6,7 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి: నిండుకుండలా సోమశిల జలాశయం