ETV Bharat / state

టిడ్కో లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్టాలంటున్న బ్యాంకులు

author img

By

Published : Jan 6, 2023, 10:24 AM IST

Tidco Houses Bank Loans : టిడ్కోఇళ్లకు ఒక్కరూపాయికే అందిస్తున్నామంటూ.. హంగామా చేసిన వైసీపీ నేతలు, తాజాగా లబ్దిదారులకు షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులోని టిడ్కో ఇళ్ళపై ఉన్న రుణాలను చెల్లించాలంటూ, బ్యాంకులు వేదింపులకు దిగడంతో.. లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులను చేసుకునే తాము.. పెద్ద మొత్తంలో రుణాలు చెల్లించమంటే, ఎక్కడ్నుంచి చెల్లిస్తామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tidco Houses Bank Loans
లబ్దిదారులకు వేధింపులు

Harassment by Bankers : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్దిదారులకు అందించింది. ఇళ్లను అప్పగించే సమయంలో బ్యాంకులకు ఒక్కరూపాయి కూడా కట్టనవసరం లేదని నేతలు చెప్పారు. జగనన్న ఇళ్ల ఇచ్చారని..అందరి సంబర పడ్డారు. అయితే, తాజాగా లబ్దిదారలకు బ్యాంకులు షాక్ ఇచ్చాయి. మీరుంటున్న ఇళ్ల తాలుక రుణాలను చెల్లించాలంటూ.. హుకూం జారీ చేస్తున్నారు. రుణాలు చెల్లించమని మొదట మెసేజ్​లు చేసేవారని.. తర్వాత ఫోన్లు చేయటం ప్రారంభించారని లబ్దిదారులు వాపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఇంటికే వచ్చి రుణాలు కట్టమని వేదింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రూపాయి కట్టనవసరం లేదని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకర్లను పంపిస్తొందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కేటాయించినప్పుడు చెల్లించాల్సిన నగదు కంటే ఎక్కువ చెల్లించామని.. అవి ఇప్పుడు వాటిని జమ చేసుకోమని అడిగితే ఒప్పుకోవటం లేదని ఆరోపించారు. తమ సొంత ఖాతాల్లో నుంచి నగదు వసూలు చేస్తున్నరాని వేదన వ్యక్తం చేస్తున్నారు.

"రుణాలు మాఫీ చేస్తామని అంటే మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు మాకు టిడ్కో ఇళ్లులు పెద్ద సమస్యగా మారాయి. బ్యాంకులు మమ్నల్ని రుణాలు చెల్లించమని అంటున్నాయి. మేము దుకాణాలలో పని చేసుకుని జీవిస్తున్నము. మాకు వచ్చే నెల జీతం సగానికి పైగా రుణాలు చెల్లిస్తే మేము ఎలా బతకాలి." - టిడ్కో లబ్దిదారు

బ్యాంకర్ల నుంచి టిడ్కో లబ్దిదారులకు వేధింపులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.