నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా ప్యాకెట్లు విక్రయించేందుకు తీసుకోస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కావలి పట్టణంలోని కచేరిమిట్ట కు చెందిన శిఖరం వెంకయ్య అనే వ్యక్తి నిషేధిత వస్తువులైన గుట్కాలు అమ్మేందుకు తీసుకొస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 1450 గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకున్నారు. వాటి విలువ సుమారు 30 వేల రూపాయలకు పైగా ఉండవచ్చని సీఐ తెలిపారు. నిషేధిత వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇది చూడండి: