ETV Bharat / state

ఇంకెన్నాళ్లీ చెత్త కుప్పలు.. తీర్చరా ప్రజల కష్టాలు?! - nellore district latest news

నగరాల అభివృద్ధి పేరిట స్మార్ట్‌ సిటీ, సుందర నగరం ఇలా ఎన్నో అందమైన ప్రతిపాదనలు.. ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. స్వచ్ఛ నగరంగా మారుస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారే తప్ప.. అమలు చేసే జాడ కనిపించటం లేదు. అందుకు నెల్లూరు నగరమే.. నిదర్శనం. స్వచ్ఛమైన పంట కాలువలు సైతం మురుగు కూపాలుగా దర్శనమిస్తుండడం.. అక్కడి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

pollution in nellore
కాలుష్య నగరంగా నెల్లూరు
author img

By

Published : Apr 24, 2021, 3:04 PM IST

నెల్లూరులో పెరిగిపోతున్న కాలుష్యం

లక్షల జనాభా కలిగిన నెల్లూరు నగరం.. మురికి కూపంగా మారుతోంది. నగరానికి ఎటువైపు చూసినా దుర్గంధం వెదజల్లే చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. సాగు, తాగునీటి అవసరాలు తీర్చే చెరువులు సైతం వ్యర్థాలతో నిండిపోయాయి. అధికారుల మొక్కుబడి ప్రతిపాదనలకు తోడు ప్రజల నిర్లక్ష్యంతో.. పంట కాలువలు నాశనమవుతున్నాయి. వందేళ్ల క్రితం నగరం నుంచి వెళ్లేలా సర్వే కాలువ ఏర్పాటు చేశారు. 15 ఏళ్ల క్రితం ఈ నీటినే తాగేవారు. ఇంత స్వచ్ఛంగా ఉండే కాలువ.. నేడు వ్యర్థాలకు నిలయంగా మారింది.

నగరంలోని పెన్నా బ్యారేజి సమీపం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా 20 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. 100 మీటర్లు వెడల్పు ఉండే కాలువ, 50 మీటర్లకు కుచించుకుపోయింది. మరోవైపు.. పంటకాలువలోకి నగర పాలక సంస్థ అధికారులే మురుగు కాలువలను మళ్లించేలా చేసిన నిర్మాణాలపై.. తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. హోటళ్ల యజమానులు ఇష్టాను సారం ఆక్రమించేసి... వ్యర్థాలను కూడా అందులోనే పడేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చివరికి ఏ జంతువు చనిపోయినా.. ఆ కాలువలోనే పడేస్తున్నారని జనం వాపోతున్నారు. ఆ నీటినే నేరుగా పంటలకు ఉపయోగిస్తున్న కారణంగా.. ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పంటకాలువలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, పాలకులను నగరవాసులు కోరుతున్నారు. నగరాన్నిసుందరంగా మార్చి.. చక్కటి పార్కును అందుబాటులోకి తీసుకువస్తే సేదతీరే వసతి సైతం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అక్కడ ఆర్టీసీకి ఇప్పుడు ఏమైంది? కరోనా నిబంధనలు పట్టవా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.