కోనసీమ కోడిపందాల సంస్కృతి ఇప్పుడు నెల్లూరు జిల్లాకి పాకింది. రానున్న సంక్రాంతిని అదనుగా చేసుకొని పందెంరాయుళ్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బోగోలు మండలం బిట్రగుంటలోని.. గంగతిప్ప అటవీప్రాంతాన్ని కోడిపందాలకు అడ్డాగా మార్చారు. కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న బిత్రగుంట పోలీసులు మెరుపు దాడులు చేశారు. పోలీసుల రాకను గుర్తించిన కొందరు పందెం రాయుళ్లు కార్లతో సహా పరారైనట్లు దాడులు నిర్వహించిన ట్రైనీ ఐపీఎస్ కె. వి మహేశ్వరరెడ్డి తెలిపారు.
ఈ దాడుల్లో 22 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకొని.. 13 కార్లు, బైకు, ఆటో, 18 కోళ్లతో పాటు రూ.72,600 నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు .దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: